దర్శి: రాజంపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఆటో ట్రాక్టర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
Darsi, Prakasam | Apr 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా ఆటో ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ ద్వారా దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.