రాయదుర్గం: నేమకల్లులో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
బొమ్మనహాల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే తో కలసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా పిఎం సూర్య ఘర్ ద్వారా స్థానిక ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ రూప్ టాప్ ను ప్రారంభించారు. అలాగే కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.