గిద్దలూరు: గిద్దలూరులో కుక్కల దాడిలో మేకలు మృతి చెందిన నష్టపోయిన రమణమ్మకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎస్టీ కాలనీలో కొద్దిగా రోజుల క్రితం కుక్కల దాడిలో మేకలు గొర్రెలు మృతి చెందాయి. సోషల్ మీడియాలో మేకల కాపరి రమణమ్మ ఆర్థికంగా నష్టపోయానని ఏడుస్తూ ఒక వీడియో వైరల్ అయింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నష్టపోయిన గొర్రెల కాపరి రమణమ్మకు 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి రమణమ్మకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.