యాడికి పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ఆర్. శ్రీనివాసులును నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో యాడికి సీఐగా పనిచేసిన ఈరన్నను అనంతపురం వీ ఆర్ కు బదిలీ చేశారు. అనంతపురం వీఆర్ లో ఉన్న శ్రీనివాసులు ను యాడికి కి బదిలీ చేశారు. రెండు రోజుల్లో శ్రీనివాసులు సీఐగా బాధ్యతలు స్వీకరించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.