కళ్యాణదుర్గం: యనకల్లు ఆనంద్ మృతిపై అనవసరంగా వదంతులు క్రియేట్ చేస్తే చర్యలు తీసుకుంటాం: కళ్యాణదుర్గంలో డీఎస్పీ రవిబాబు
యనకల్లు కు చెందిన ఆనంద్ మృతిపై ఎవరైనా అనవసరంగా వదంతులు క్రియేట్ చేస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనంద్ మృతిపై మొదట ఆత్మహత్యయని, ఆ తర్వాత హత్యయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు.పూర్తిస్థాయిలో విచారణ, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరు వదంతులు క్రియేట్ చేయొద్దన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.