సంతనూతలపాడు: చీమకుర్తిలో ది గుంటూరు కోపరేటివ్ బ్యాంకు ను ప్రారంభించిన చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు
గుంటూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ 23వ బ్రాంచ్ శుక్రవారం చీమకుర్తిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,స్థానిక శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి,ఊడ చైర్మన్ షేక్ రియాజ్,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సుమారు 1200 కోట్ల రూపాయల టర్నోవర్తో, రిజర్వ్ బ్యాంకు నిబంధనలలో పనిచేస్తుందన్నారు.