ఉరవకొండ: గౌరసంద్రమారెమ్మ దేవాలయంలో కుంకుమార్చన, దీపోత్సవ కార్యక్రమపూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని గౌరసంద్రమారెమ్మ దేవాలయంలో శుక్రవారం రాత్రి ఉగాది పర్వదినాల్లో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, దీపోత్సవ కార్యక్రమం పూజలను పురోహితులు నిర్వహించారు. ఆలయం వద్ద పూజల్లో ఆలయ సేవా కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతులను వెలిగించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద కార్యక్రమాలను సేవ కమిటీ సభ్యులు నిర్వహించారు.