యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలోని తండాలో పోలీసులు కార్డెన్ సెర్చ్, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు తండాలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తండాలో శాంతిభద్రతలు పటిష్టం చేయడం అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేసినట్లు ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.