కొండపి: మర్రిపూడి, జరుగుమల్లి మండలంలో విబిజి, రాంజీ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా మర్రిపూడి, జరుగుమల్లి మండలాలలో విబిజి రాంజీ పథకాన్ని గురువారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్న ఈ పథకానికి పేరు మార్చడం జరిగిందని ఇప్పుడు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ ప్రాంతాలలో పేదల కోసం ఈ పథకాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి స్వామి ప్రజలకు తెలిపారు.