దర్శి: దొనకొండ మండల కేంద్రంలో సాగర్ పైప్ లైన్ లను మరమ్మతులు చేపట్టిన అధికారులు
Darsi, Prakasam | Apr 27, 2026 దొనకొండ మండల కేంద్రంలో సాగర నీరు పైపు లీకేజీ వల్ల వృధాగా పోతుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. అసలే వేసవికాలంలో మంచినీటి కొరత ఉందని నీటి వృధాను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు వెంటనే పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. దీంతో నీటి వృధాను అరికట్టినట్టు అధికారులు తెలిపారు.