రాయదుర్గం: రాష్ట్ర హితం కోసమే బిజెపితో జట్టు : పట్టణంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్
రాష్ట్ర హితం కోసమే బిజెపితో జట్టు కట్టామని మీ లాగ కేసుల మాఫీ కోసం కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ YCP నేతలపై మండిపడ్డారు. సోమవారం రాయదుర్గంలో స్థానిక MLA కాలవశ్రీనివాసులు తో కలిసి మీడియాతో మాట్లాడారు. మైనార్టీలలో లేనిపోని అపోహలు సృష్టిస్తుందని ద్వజమెత్తారు. కేసుల మాఫీ కోసం BJP తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. మత సామరస్యానికి టిడిపి కట్టుబడి ఉందన్నారు.