దర్శి: దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
Darsi, Prakasam | Jun 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని దర్శి ముండ్లమూరు కురిచేడు తాళ్లూరు దొనకొండ మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేశారు. సంబంధిత అధికారులు అర్జీలను స్వీకరించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని వారికి తెలియజేశారు.