రాయదుర్గం: టిఎంసి, డిఎంకె ని మట్టికరిపించిన బిజెపి : మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
పశ్చిమ బెంగాల్, తమిళనాడు లో అత్యంత క్రూరమైన టిఎంసి ని, డిఎంకె ను మట్టికరిపించామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి వాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం పై సోమవారం రాయదుర్గంలో సంబరాలు నిర్వహించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశంలో కాషాయ జెండా రెపరెపలాడుతోందన్నారు. విశ్వ గురువుగా నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ సాధనకు ఈ పలితాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.