మార్కాపురం: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం ముందు ఏపీ స్వచ్ఛాంద కార్పొరేషన్ సరఫరా చేసిన 22 రిక్షాలు, 10 తోపుడు బండ్లు మూడు ట్రాక్టర్లు, 200 ప్లాస్టిక్ డస్ట్ బిన్లను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంబంధిత గ్రామపంచాయతీలకు అందజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు వాటిని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎంపీపీ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు