రాయదుర్గం: జీఓ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్, దర్నా
రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం. 396ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ పెన్‌డౌన్ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు మాట్లాడుతూ, జి.ఓ. 396 అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తమ ఆవేదనను సానుకూలంగా పరిశీలించి, జి.ఓ. 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు.