దర్శి: గంగ దేవపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరం పై పోలీసులు దాడి నలుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగాదేవపల్లి గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న 2100 నగదు నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అక్రమ పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.