రాయదుర్గం: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే శిక్షార్హులు : డిఎస్పీ రవిబాబు
రోడ్డు ప్రమాదాల నివారణకు రాయదుర్గం పోలీసులు చేపడుతున్న చర్యలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్ పై సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ లకు వాహనాలు ఇస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని కళ్యాణదుర్గం DSP రవిబాబు హెచ్చరించారు. రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్‌లో తనిఖీల్లో గుర్తించిన మైనర్ లు వారు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై శుక్రవారం అవగాహన కల్పించారు. మెదటి సారి పట్టుబడితే రూ.5 వేలు రెండవ సారి పట్టుబడితే 10 వేలు జరిమానా తోపాటు జైలుశిక్ష ఉంటుందన్నారు.