మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా ఆకట్టుకున్న మాజీ సీఎంలు రామారావు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ సీఎంలు నందమూరి తారక రామారావు, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ప్రత్యేకంగా నిలిచాయి. దోర్నాల బస్టాండ్ సెంటర్, గడియారం స్తంభం సెంటర్లో తమ అభిమాన నాయకుల విగ్రహాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వేలాదిమందికి మాజీ సీఎంల విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆ ప్రాంతం సందడి నెలకొన్నది.