కొండపి: టంగుటూరు జాతీయ రహదారిపై ఐచర్ వాహనం ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు జాతీయ రహదారిపై గురువారం ఐచర్ వాహనం ఆటో ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శనగపప్పు లోడుతో వెళ్తున్న ఆటోని వెనక నుంచి ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని హైవే పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదం జరగకుండా పోలీసులు రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించి శనగపప్పును తొలగించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.