రాయదుర్గం: పల్లేపల్లి హైస్కూల్ విద్యార్థులకు క్రీడా పరికరాలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేసిన రిజోనియో సంస్థ
రాయదుర్గం మండలంలోని పల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.1 లక్ష విలువైన క్రీడా పరికరాలను రిజోనియో కార్పోరేట్ సంస్థ ద్వారా వితరణ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, సంస్థ చీఫ్ మేనేజర్ హరేంద్ర పాండే, ప్రాజెక్టు మేనేజర్ మనోహర్, టిడిపి నేతలు హనుమంతు, మోహన్ రెడ్డి, చేతుల మీదుగా కిట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రాంతంలో విద్యుత్ లైన్ నిర్మాణం చేసే ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరగానే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.