గిద్దలూరు: గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కనీస పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంపై సిఐటియు నాయకులు ఆవులయ్య తీవ్ర ఆగ్రహం
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కనీస పార్కింగ్ స్థలానికే కేటాయించకపోవడంపై సిఐటియు నాయకులు ఆవులయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పనులపై తమ బంధువులను కుటుంబ సభ్యులను బస్టాండ్ లో విడిచి పెట్టేందుకు వస్తుంటారని అంతేకాకుండా కార్గో సర్వీస్ సేవలను వినియోగించుకునేందుకు వినియోదారులు వస్తుంటారని వీరికి ఎక్కడ ద్విచక్ర వాహనాన్ని నిలిపేందుకు స్థలం లేకపోవడానికి అసహనం వ్యక్తం చేశారు. కేవలం 5 నుంచి 15 నిమిషాలలోపే పనులు చూసుకుని వెళ్లే వారికి ప్రైవేటు పార్కింగ్ లో నగదు ఇచ్చి మరి పార్కింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు చెప్పడం ఆగ్రహం వ్యక్తం చేశారు.