కొండపి: కొండపి మండలం అనకర్లపూడి సమీపంలో గంజాయి తరలిస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని అనకర్లపూడి అట్లేరు వాగు సమీపంలో గంజాయి తరలిస్తున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్నామని సిఐ సోమశేఖర్ శుక్రవారం వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 3.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసులో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి గంజాయి తరలిస్తున్నారో విచారణలో తెలియవలసి ఉంది విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.