మార్కాపురం: జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ పరిసరాలలో వీధిలైట్లు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కంభం రోడ్డులో గల శివాజీ నగర్ పరిసరాలలో వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి కారణంగా ప్రమాదాల భయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు మరమ్మత్తు చేపట్టి వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.