మార్కాపురం: రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ బాలుర పాఠశాలలో సెప్టెంబర్ 11 12 13 వ తేదీలలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మార్కాపురం వేదిక కావడంతో ఆసక్తి నెలకొన్నది.