యర్రగొండపాలెం: జూన్ 27వ తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కొంతమంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మంజూరు
మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు కింద 11 ముంపు గ్రామాలు ఉన్నాయి. 30 ఏళ్లుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఆ గ్రామాల నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు 905 కోట్లు మంజూరు చేశారు. జూన్ 27వ తేదీ సీఎం చేతుల మీదుగా కొంతమంది నిర్వాసితులకు 300 కోట్లు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రకటించారు. అర్హత ఉండి కూడా జాబితాలో లేని నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తూ నిరాశగా ఉన్నారు.