యర్రగొండపాలెం: నీటి కుంటలో పడిన చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ బోయిలపల్లి ఎస్సీ పాలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని వారిని ఓదార్చారు.