తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి జయంతి వేడుకలు
తాడిపత్రి లోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో గురువారం మహాలక్ష్మి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహాలక్ష్మి జయంతి వేడుకలను తిలకించడానికి భక్తులు తరలి వచ్చారు. వేద పండితులు వేదమంత్రోచరణల మధ్య జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.