రాయదుర్గం: వేపరాళ్ల గ్రామంలో ఈతకు వెళ్లి టెన్త్ విద్యార్థి మృతి
రాయదుర్గం మండలం వేపరాళ్ల వద్ద ఈతకు వెళ్లి టెన్త్ విద్యార్థి మృతి చెందాడు. కోనాపురం గ్రామానికి చెందిన శరత్ బెంగళూరులో టెన్త్ చదువుతూ పాసైన ఆనందంలో వేపరాళ్ల లో ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి శుక్రవారం సాయంత్రం వచ్చాడు. మరో యువకుడితో కలసి సమీపంలో ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లి మరణించాడు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.