కొండపి: సింగరాయకొండ ఎస్సైగా సుధీర్ కుమార్ బాధ్యతల స్వీకరణ, పల్నాడు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సుధీర్ కుమార్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎస్సైగా సుధీర్ కుమార్ గురువారం తన బాధ్యతలు స్వీకరించారు. గతంలో పల్నాడు జిల్లాలో విధులు నిర్వహించిన సుధీర్ కుమార్ బదిలీపై సింగరాయకొండకు వచ్చినట్లుగా తెలిపారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా విధులు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. కొద్ది రోజులుగా సింగరాయకొండ ఎస్సై స్థానం ఖాళీగా ఉండడంతో స్థానికంగా విమర్శలు వినిపించాయి. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎస్సైని నియమించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.