రాయదుర్గం: బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పోరాటం చేస్తా : బివిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి లావణ్య
బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వారిని ఐక్యం చేసి పోరాటం చేస్తానని బోయ, వాల్మీకి సంఘం బివిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి లావణ్య స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆమె రాయదుర్గం పట్టణంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షుడు తలారి అంజి సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాల్మీకుల సంక్షేమం, అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.