గిద్దలూరు: బెస్తవారిపేట పట్టణంలోని ఇస్లాం పేటలో శుక్రవారం పట్టపగలే చోరీ, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఇస్లాం పేటలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. రేష్మ అనే మహిళకు చెందిన ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువా పగలగొట్టారు. అందులో ఉన్న 40 తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.6 వేలు నగదు దొంగలు అపహరించారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని రేష్మ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.