భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఇంటి సర్వేలు, జాబితా నవీకరణపైన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి 18 సంవత్సరాల పైబడిన అర్హులే ఓటర్ గా నమోదు కావచ్చని వెల్లడించారు.