దర్శి: తూర్పు గంగవరం గ్రామంలో మజీద్ పక్క బజార్లో మురుగునీటితో అవస్థలు పడుతున్న స్థానికులు
Darsi, Prakasam | Jun 26, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం మదీనా మసీదు పక్క బజార్లో మురికి నీరు రోడ్డుపైకి చేరాయి. గత కొద్ది సంవత్సరాలుగా మురికి నీరు కాలువలు నుంచి రోడ్డుపైనే ప్రవహించడంతో దుర్వాసన వెదజల్లుతుంది. పంచాయతీ అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. ఇప్పటికైనా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు.