యర్రగొండపాలెం: త్రిపురాంతకం శాఖ గ్రంధాలయంలో జెర్రిపోతు పాము కలకలం
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం శాఖ గ్రంథాలయం వద్ద జేరిపోతు పాము కనపడింది. దీంతో శాఖ గ్రంథాలయం సిబ్బంది స్నేక్ క్యాచర్ మల్లికార్జున కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మల్లికార్జున సంఘటన ప్రాంతానికి చేరుకొని పామును పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పాములను నల్లమల అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుందని మల్లికార్జున తెలిపారు. పాములు కనబడితే సమాచారం ఇవ్వాలన్నారు