ఉరవకొండ: బెలుగుప్పలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సభ్యులు వినతి
పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు. బెలుగుప్పలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ పెద్దన్న, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తహశీల్దార్ అనిల్ కుమార్ తోపాటు సభ్యులు హాజరయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారని పరిహార వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సభ్యులు కోరారు.