మార్కాపురం: తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానికులు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం తర్లుపాడు ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతున్నాయి. రోడ్డును ఆనుకొని పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సైడ్ కలవలేక ప్రధాన రహదారిపై వర్షపు నీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.