దర్శి: రామచంద్రపురం లో సీసీ రోడ్లు ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అన్నారు. గత ఐదేళ్లలో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.