దర్శి: దర్శి పట్టణంలో మండిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ చిన్నారులు వృద్ధులు
Darsi, Prakasam | Apr 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మంగళవారం ఎండలు మండిపోయాయని స్థానికులు తెలిపారు. ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందన్నారు. ఉదయం నుంచి వేడిమి తీవ్రత బాగా ఉందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. పట్టణంలోని ప్రధాన వీధులలో జనసంచార అంతంతమాత్రంగానే కనిపించింది. విపరీతమైన వేడిమి ఒక్క పూతతో చిన్నారులు వృద్ధులు అవస్థలు పడ్డారు. రాత్రిపూట కూడా వేడి వాతావరణంగానే ఉందన్నారు.