యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబు ముందు కన్నీరు పెట్టుకున్న వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులకు చెందిన రైతు ఖాసీం వలి
వెలుగొండ ప్రాజెక్టు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ముందు ఓ రైతు కన్నీరు పెట్టుకున్నారు. పెద్దారవీడు మండలం ముంపు గ్రామమైన సుంకేసులకు చెందిన కాసిం వలి అనే రైతు 30 ఏళ్ల నాటికల నెరవేరుస్తున్నారని తమకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు అనుబంధంగా ఉన్న గ్రామానికి వదిలి వెళ్లాలంటే కష్టంగా ఉంది అన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు తమను అనేక రకాలుగా వేధించారని కన్నీటి పర్యంతమయ్యారు. తమను గుర్తించే నాయకుడు మీరేనంటూ ఆనంద బాష్పాలు కార్చారు.