మార్కాపురం: రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు అధికారులకు విజ్ఞప్తి
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై మార్చి 26వ తేదీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొని మంటల్లో సుమారు 14 మంది సజీవ దహనమైన విషయం తెలిసినదే. అయితే జరిగిన సంఘటన ప్రాంతంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు గాని, వేగాన్ని నిరోధించే సూచికలు గాని లేకపోవడం శోచనీయం. మూలమలుపు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.