దర్శి: దర్శిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసిన ఎంపీ శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతినెల క్రమం తప్పకుండా పింఛన్ అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.