కనిగిరి: కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మీడియా సమావేశం, రాజధాని పట్ల వైసీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
రాజధాని విషయంలో ఐదు సంవత్సరాలుగా ఏమి చేశారని వైసిపి పార్టీని ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మీడియా ముఖంగా ప్రశ్నించారు. శనివారం కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు విద్యాలయాలను, ఆస్పత్రిలో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో తీసుకువచ్చారని అన్నారు. పార్లమెంట్లో దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి సపోర్ట్ చేస్తే వైసిపి ఒక్క పార్టీ వ్యతిరేకించండి అని అన్నారు. మద్యం మత్తులో ఎవరో మావిగన్ పేరు సిఫార్సు చేస్తే ఆ పేరు పెడతాననడం హాస్యాస్పదమన్నారు.