రాయదుర్గం: కెంచానపల్లి వద్ద బైక్ డీకొన్న ఘటనలో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా, కూలీలకు తీవ్ర గాయాలు
రాయదుర్గం మండల కెంచానపల్లి సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటో, ఎదురుగా వచ్చిన బైక్ డీకొన్న ఘటనలో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు మలకాపురం గ్రామానికి చెందిన 12 మంది కూలీలు పనికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా బైక్ డీకొని ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మల్లికార్జున, చిట్టి, బేబీ ల పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.