మార్కాపురం: బోడపాడు గ్రామ చెరువు అక్రమాలకు గురైందని స్థానికుల నుండి విమర్శలు
మార్కాపురం మండలం బోడపాడు గ్రామ చెరువు అక్రమాలకు గురైందని స్థానికుల నుండి విమర్శలు వినపడుతున్నాయి. సుమారు 90 ఎకరాలు విస్తీర్ణం కలిగిన చెరువు కూచించుకొని పోయి చిన్నగా మారిందన్నారు. అసలు చెరువు కట్ట సరిహద్దులపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చెరువు సప్లై ఛానల్ కూడా అక్రమానికి గురైనట్లుగా గుర్తించారు. చెరువు, కాలువ అక్రమాల నుండి కాపాడాలని, జిల్లా అధికారులు పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు