యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేయాలన్నారు. వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు