గిద్దలూరు: కంభం మండలం నల్లకాలువ గ్రామంలో నాగుపాము కలకలం, పాముని పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన అధికారులు
మార్కాపురం జిల్లా కంభం మండలం నల్లకాలువ గ్రామంలో నాగుపాము కలకలం రేపింది. 5 అడుగులకు పైగా ఉన్న నాగుపాము గ్రామంలోని ఓ కోళ్ల ఫారం లో కనిపించింది. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు నాగుపాముని చాకచక్యంగా బంధించి స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కోళ్లు ఎక్కువగా శబ్దం చేస్తున్న విషయాన్ని గమనించిన గ్రామస్తులు పాము వచ్చిందని గుర్తించారు. విషపూరితమైన పామును అటవీ శాఖ అధికారులు పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.