రాయదుర్గం: గుమ్మగట్ట మండల కురుబ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గుమ్మగట్ట మండల కురుబ సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కురుబ సంఘం తాలూక అధ్యక్షుడు కోటి బసవ సమక్షంలో నూతన అధ్యక్షుడిగా గోనబావి మారన్న, ఉపాధ్యక్షులుగా మారంపల్లి నాగేష్, గుమ్మగట్ట వన్నూరప్ప, ప్రధాన కార్యదర్శిగా గలగల నాగరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సందీప్, కొత్తపల్లి వెంకటేశులు, మారంపల్లి శివన్న, రుద్రయ్య, గలగల అశోక్, దేవిరెడ్డిపల్లి కృష్ణమూర్తి, నీలయ్య, హనుమంతప్ప ఎంపికయ్యారు. దుర్గప్ప, కె.మరిస్వామి, గుమ్మగట్ట గిరిమల్లప్ప, గోనుబాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.