దర్శి: దర్శిలో నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం
Darsi, Prakasam | Apr 19, 2025 దర్శి నగర పంచాయతీ పరిధిలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరించారు. ఈ సందర్భంగా దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై.మహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరి దగ్గర ఇలాంటి వ్యర్థాలు ఉంటే నగర పంచాయతీ కార్యాలయం, పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని కోరారు.