దర్శి: కొత్తపాలెంలో ఇంటి డాబా పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
Darsi, Prakasam | Apr 17, 2025 తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఇంటి డాబాపై నుంచి జారి పడి వ్యక్తి గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసింహరావు(35) ఇంటి డాబాపై నుంచి నీటి కోసం కిందికి వస్తూ జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.