దర్శి: దర్శిలో బాలుడు.. మీకు తెలుసా? తెలిస్తే దర్శి పోలీస్ స్టేషన్లో సంప్రదించండి
Darsi, Prakasam | Apr 19, 2025 తప్పిపోయి ఓ బాలుడు దర్శికి వచ్చాడు. స్థానిక కురిచేడు రోడ్డు జనతా బజార్ వద్ద తిరుగుతుండగా శనివారం కొందరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బాలుడి వయసు సుమారు ఐదేళ్లు ఉంటాయి. ఆ చిన్నారి ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ఈ వీడియోలోని బాలుడిని గుర్తించిన వ్యక్తులు తమను సంప్రదించాలని దర్శి పోలీసులు కోరారు.